యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయం
– ప్రతి కుటుంబంలోని నిరుద్యోగికి భరోసా
– మెగా జాబ్ మేళాను జయప్రదం చేయాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– మేగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ముందుకు సాగడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడారు.

ఈనెల 29న ఎమ్మెల్యే మనోహర్ ఆధ్వర్యంలో పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్న మెగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ ను పార్టీ నేతలు, నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) సహకారంతో దాదాపు 50 కంపెనీ నుంచి మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 29న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా కంపెనీలలో 10వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో జాబ్ మేళాను జయప్రదం చేసేవిధంగా పనిచేయాలన్నారు. ప్రతి కుటుంబ నుంచి నిరుద్యోగులను తరలించేలా చూడాలన్నారు. అదేవిధంగా పట్టణంలోని అసోసియేషన్లు, కుల సంఘాలు భాగస్వాములు అయ్యి జాబ్ మేళాను జయప్రదం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, సీనీయర్ నాయకులు ఉత్తమ్ చంద్, నాయకులు మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, అజయ్ ప్రసాద్, చెన్నారం అనిల్. లింగదలి రవికుమార్, బాతుల వెంకటయ్య, రాము నాయక్, పార్టీ అధ్యక్షులు హబీబ్ లాల, జన్నె నాగప్ప. నర్సింలు, గోపాల్, మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్, మాజీ కౌన్సిలర్లు బోయరవి, ప్రవీణ్ గౌడ్, బొంబీనా, యూత్ కాంగ్రెస్ నాయకులు బంటు వేణు, తుపాకుల అనిల్, లొంక నర్సింలు, మాజీ సర్పంచ్ బుడెళ్లి సాయిలు, మార్కెట్ కమిటి డైరెక్టర్లు, వివిధ మండలాల ముఖ్య నాయకులు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

