రాంమందిర్ పునర్ నిర్మాణానికి రండి

తాండూరు రాజకీయం వికారాబాద్

రాంమందిర్ పునర్ నిర్మాణానికి రండి
– చీఫ్ విప్, ఎమ్మెల్యేలకు ఆహ్వానం
– నేతలను కలిసిన ఆలయ నిర్మాణ కమిటి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ లో ఉన్న ఏకైక శ్రీరామ మందిరం దేవాలయ పునర్ నిర్మాణానికి రావాలని తెలంగాణ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలను దేవాలయ కమిటి సభ్యులు ఆహ్వానించారు.

మంగళవారం చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డిలను దేవాలయ కమిటి సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. తాండూరులో ఉన్న ఏకైక రామ మందిరాన్ని పునర్ నిర్మాణంకు శంకుస్థాపన ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈనెల 30న పునర్ నిర్మాణ శంకుస్థాపన పూజ చేస్తున్నట్లు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమానికి తప్పక రావాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ముజీబ్ ఖాన్ తదితరులను కూడా కలిసి పునర్ నిర్మాణ శంకుస్థాపనకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఇదికూడా చదవండి…

నేతల కుటుంబాలకు చీఫ్ విప్ పరామర్శ