భూ భారతి రెవన్యూ సదస్సులకు వేళాయే..!
– తాండూరు మండలంలో షెడ్యూల్ ఖరారు
– గ్రామాల్లో నిర్వహణ తేదిల జాబితా విడుదల
– భూ సమస్యలపై ఫిర్యాదుకు రైతులకు అవకాశం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకవచ్చిన భూ భారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు కోసం అధికారులు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. తాండూరు మండలంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం జరిగిందని తాండూరు తహసీల్దార్ తారాసింగ్ తెలిపారు. రెవెన్యూ సదస్సుల కోసం తన ఆధ్వర్యంలో, డిప్యూటి తహసీల్దార్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను నియమించడం జరిగిందన్నారు.

3వ నుంచి ఈనెల 20వ తేది వరకు తాండూరు మండలం, పట్టణంలో రెవెన్యూ సదస్సులు ఉదయం 9గంటల నుంచి జరుగుతాయని చెప్పారు. కొన్ని గ్రామాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు జరుగుతాయని తెలిపారు. రైతులు, నాయకులు పాల్గొని సమస్యలపై దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. గ్రామాల వారిగా జరిగే సదస్సుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
తహసీల్దార్ తారాసింగ్ ఆధ్వర్యంలో 3న ఎల్మకన్నె. 4న గోనూర్, మాచనూరు, 5న బిజ్వార్, బొంకూరు, 6న అల్లాపూర్, 9న చెనష్పూర్, కోనాపూర్, 10న చింతామణిపట్నం, 11న అంతారం, 12న బెల్కటూర్, చిట్టిగణాపూర్, 13న గుంతబాస్పల్లి, మిట్టబాస్పల్లి, 16న సంగెంకలాన్, కాంజాపూర్, 17న, మల్కాపూర్, 18న జినుగుర్తి, 19న కరణ్ కోట్, 20న తాండూరు. సాయిపూర్లో జరగుతాయని అధికారులు వెల్లడించారు.
అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ లలిత ఆధ్వర్యంలో 3న చంద్రవంచ, 4న వీర్ శెట్టిపల్లి, 5న, గౌతాపూర్, గోపన్ పల్లి, 6న ఐనెల్లి, 9న ఉద్దండాపూర్, 10న ఖాంజాపూర్, 11న రాంపూర్, వీరారెడ్డిపల్లి, 12న కోటబాస్పల్లి, 13న కొత్లాపూర్, 16న నారాయణపూర్, పర్వాతాపూర్, 17న చెంగోల్, 18న సంకిరెడ్డిపల్లి, 19న ఓగిపూర్, 20న మల్ రెడ్డిలో జరుగుతాయని వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

