ప్రీగా ఆధార్ అప్‌డేట్..!
– సొంతంగా మీరే చేసుకోవచ్చు
– ఏయే అంశాలను చేసుకోవచ్చంటే..?
– ఈనెల 14వ తేది వరకే అవకాశం
దర్శిని డెస్క్: దేశంలో ప్రతి ఒక్కరికిగా గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం ఆధార్ కార్డు వ్యవస్థను తీసుకవచ్చింది. ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు పదేళ్లకు ఒకసారి ఆధార్ ఆప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. అంతేకాకుండా కార్డు కలిగిన వారు సొంతంగా ఆప్‌డేట్ చేసుకునే అకాశం కల్పించింది. ఇందుకోసం మై ఆధార్(myAadhaar) పోర్టల్‌ను అందుబాటులో ఉంచింది. ఈ వ్యవస్థతో ఈనెల 14వ తేది వరకు ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు అప్‌డేట్ చేసుకునేందుకు గడువు ఇచ్చింది. ఆ తరువాత నేరుగా ఆధార్ కేంద్రాలకు వెళ్లి ఆప్‌డేట్ చేసుకోవాల్సిందే. దీనికి రూ. 50లు చెల్లించాల్సి ఉంటుంది. మరి ఉచితంగా ఆధార్ కార్డును ఎలా చేసుకోవాలి..? ఏయే అంశాలను ఆప్‌డే్ట్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఈ ఉచిత సేవ కింద మీరు మీ గుర్తింపు రుజువు, చిరునామా రుజువు (PoA)ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయవచ్చు. అయితే, జూన్ 15, 2025 తర్వాత మీ కార్డు పని చేయదని కాదు.. ఉచితం అనేది ఉండదు., మీరు భౌతిక ఆధార్ కేంద్రానికి వెళ్లి సమాచారాన్ని అప్‌డేట్ చేసుకుంటే రూ. 50 రుసుము వసూలు చేస్తారు. ఇది ప్రస్తుత ఆఫ్‌లైన్ ఛార్జీకి సమానం.
ఆధార్‌ను ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలి?
ముందుగా myAadhaar పోర్టల్ (https://myaadhaar.uidai.gov.in)కి వెళ్లండి.
ఆధార్ నంబర్, OTP ద్వారా లాగిన్ అవ్వండి.
చెల్లుబాటు అయ్యే PoI, PoA డాక్యుమెంట్ స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయండి.
అభ్యర్థనను సమర్పించి, 14 అంకెల అప్‌డేట్ అభ్యర్థన సంఖ్య (URN)ను రాసుకోండి.
చిరునామా మార్పు కోసం..
ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్‌కి లాగిన్ అవ్వండి.
‘ప్రోసీడ్ టు అప్‌డేట్ అడ్రస్’ పై క్లిక్ చేయండి.
కొత్త చిరునామాను నమోదు చేసి, దాని రుజువును అప్‌లోడ్ చేయండి.
సబ్మిట్ చేసి URN పొందండి.
అభ్యర్థన ఆమోదించబడిన తర్వాత మీరు మీ అప్‌డేట్ చేసిన ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇదికూడా చదవండి…

