పౌష్టికహారంతో టీబీ, హెచ్ఐవీ నియంత్రణ
– వికారాబాద్ డీఎంహెచ్ ఓ డా. వెంకట్ రవణ
– తాండూరులో బాధితులకు న్యూట్రీషన్ కిట్ల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : పౌష్టికాహారం తీసుకోవడం వల్ల టీబీ, హెచ్ఐవీ వ్యాధులను నియంత్రించడం సాధ్యమవుతుందని వికారాబాద్ జిల్లా డీఎంహెచ్ డా. వెంకట్ రవణ అన్నారు. శుక్రవారం తాండూరులో ప్రైవేట్ ప్రాక్టీషనర్ అసోసియేషన్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో టీబీ, హెచ్ఐవీ బాధితులకు న్యూట్రీషన్ కిట్లను పంపిణీ చేశారు. డీఎంహెచి డా. వెంకట రవణ హాజరై బాధితులకు కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ, హెచ్ఐవీ బారిన పడిన బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సరైన సమయంలో వ్యాధులను గుర్తించి చికిత్సలు తీసుకుంటే నయం చేసుకోవచ్చన్నారు. అదేవి ధంగా బాధితులు పోషక విలువలు ఉన్న పౌష్ఠికాహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెంపొందుతుందన్నారు. తద్వారా వ్యాధులను నియంత్రించడం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ డా. రవీంద్ర యాదవ్, ఏఓ ప్రవీణ్ కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ డా. బుచ్చిబాబు, డా. సమీవుల్లా, ప్రైవేట్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ అధ్యక్షులు పవన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్మాయిల్ ఫాష, తాండూరు ఉపాధ్యక్షులు అబ్దుల్ గఫ్పార్, ఎండీ మౌలానా, వెంకట సుబ్బయ్య, గణపతిరావు, ఆఫీస్ ఇంజార్జ్ దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…