ఏరువాక ట్రెండ్.. అదుర్స్..!
– తాండూరులో ఘనంగా సంబరాలు
– ఆకట్టుకున్న ఎడ్లబండ్ల ఊరేగింపు
– సందడి చేసిన బీజేపీ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి యేడాది పొలాల్లో పూజలు చేసి పంటలు బాగా పండాలని వేడుకుంటూ జరుపుకునే సంప్రదాయ పండగ ఏరువాక పౌర్ణమి. ఆనాధిగా సంప్రదాయంగా జరుపుకునే పండగను తాండూరులో ట్రెండింగ్‌లా అదరగొట్టారు. బుధవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా తాండూరు పట్టణం సాయిపూర్, పాత తాండూరు, మల్ రెడ్డిపల్లి తదితర ప్రాంతాల్లో అన్నదాతలు పశువులు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

ఉదయమే తమ పాడి పశువులకు, ఎడ్లకు స్నానాలు చేయించి, రంగు రంగులతో అలంకరించారు. ఇండ్లలో వండుకున్న పిండి వంటలకు పశువులకు తినిపించారు. అనంతరం సాయంత్ర వేళలో ఎడ్ల బండ్లలో చిన్నా, పెద్దలు కూర్చోని పురవీధుల్లో ఊరేగించారు. ఈ ఊరేగింపు అందరిని ఆకట్టుకుంది.

మరోవైపు పట్టణంలోని మల్ రెడ్డిపల్లిలో నిర్వహించిన ఏరువాక సంబరాలలో బీజేపీ నేతలు సందడి చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం తదితరులు కాడెద్దులకు పూజలు నిర్వహించారు. అనంతరం సిద్దం చేసిన ఎడ్ల బండిలో సవారీ చేస్తూ సందడి చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పాడి, పశువులు వృద్ది చెంది రైతులకు అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో పట్టణ ఉపాద్యక్షులు దోమ కృష్ణ, చిదిరి ప్రకాశ్, ప్రహల్లాదరావు, మిట్టి శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, వడ్డె సాయిలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

