అజారోద్దీన్‌కు వెలకమ్..!
– సన్మానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– క్యాంపు కార్యాలయం వద్ద స్వాగతం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్ అజారోద్దీన్ ను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సన్మానించారు.

ఆదివారం తాండూరులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి అజారోద్దీన్ వచ్చారు. ఈ సందర్బంగా తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అజారోద్దీన్ కు స్వాగతం పలికారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అజారోద్దీన్ కు శాలువాతో సత్కరించి పూల మాలతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, నాయకులు డా. సంపత్ కుమార్, అబ్దుల్ రవూఫ్, జీఎంకే బిల్డర్స్ అధినేత ముజీబ్ ఖాన్, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, నాయకులు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

