జాతీయ రోడ్డు విస్తరణపై రాద్దాంతమెందుకు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

జాతీయ రోడ్డు విస్తరణపై రాద్దాంతమెందుకు..!
– అభివృద్దిని అడ్డుకోవడం పద్దతి కాదు
– తాండూరు ఎమ్మెల్యేను విమర్శించడం తగదు
– భద్రేశ్వర రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో జరుగుతున్న జాతీయ రోడ్డు అభివృద్ధి విషయంలో అధికారంలో ఉన్నప్పుడు ఓ విధంగా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ విధంగా స్పందించడం పద్దతి కాదని తాండూరు భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ అన్నారు. తాండూరు పట్టణంలో రోడ్ల విస్తరణలో భాగంగా చేపడుతున్న జాతీయ రోడ్డు సైడ్‌ డ్రైన్‌ పనులను మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆసిఫ్‌ అడ్డుకోవడంపై స్పందించారు.

సైడ్ డ్రైన్ విషయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పక్షపాతం ప్రదర్శిస్తున్నారని ఆరోపించడాన్ని ఖండించారు. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా నిర్మాణం చేపడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించడాన్ని కొట్టి పారేశారు. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తాండూరు మీదుగా జాతీయ రోడ్డు పనులు, రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. అప్పట్లో చించొల్లి రోడ్డు మార్గం సేయింట్ మార్క్స్ స్కూల్ సమీపంలో, కోడంగల్ రోడ్డు మార్గంలో ఓ జువేల్లరీ షాపు వద్ద నిర్మించిన సైడ్ డ్రైన్ పనులు నిబంధనల ప్రకారం చేట్టలేదని, ఈ విషయం అందరికి తెలుసని అన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఫీట్లను కుధించి డ్రైన్‌ పనులు చేపట్టారని అన్నారు.

అప్పట్లో అధికారంలో ఉండి ఎందుకు నోరు మెదపలేదని అన్నారు. అంతేకాకుండా అప్పట్లో ఎవరెవరికి ఎంతెంత ముడుపులు ఇచ్చారో అన్ని రికార్డులు ఉన్నాయని అన్నారు. అప్పుడు నిబంధనలు కనపించలేదా అని ప్రశ్నించారు. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు.. అని అన్నారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ది కోసం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. జాతీయ రోడ్డు సైడ్ డ్రైన్‌ పనుల విషయంలో ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం తగదన్నారు. అదేవిధంగా అభివృద్ధి పనులను అడ్డుకోవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోండి