తుల్జా భవాని దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– ఎమ్మెల్యేను కలిసిన రాజ్ పుత్ సమాజం సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని తుల్జా భవాని దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు.

శుక్రవారం హైదరాబాద్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు రాజ్ పుత్ సమాజం అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఉమేష్ సింగ్ ఠాకూర్, ప్రధాన కార్యదర్శి శివానంద్ సింగ్ ఠాకూర్, నవాంది పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ ల ఆధ్వర్యంలో సమాజం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాండూరులోని తుల్జా భవాని దేవాలయ అభిృద్ధికి తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యేను కోరారు. అదేవిధంగా సమాజం కోసం కేటాయించి భూమిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టేందుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఇందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించి దేవాలయ అభివృద్ధితో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి త్వరలోనే రూ. 25 లక్షల సహాకారం అందిస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమాజం పూర్వాధ్యక్షులు మహేష్ సింగ్ ఠాకూర్, ఠాకూర్ రమేష్ సింగ్, యువజన అధ్యక్షులు దీపక్ సింగ్ ఠాకూర్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

