ఉద్యమ స్ఫూర్తి ప్రొ. జయశంకర్ సార్..!
– ఆయన ఆశయాలను నెరవేర్చాలి
– తాండూరులో వర్ధంతి, నేతల నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెంలగాణ జాతిపిత ఫ్రోఫెసర్ జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తిగా చిరస్మరణీయుడుగా నిలిచిపోయారని తాండూరుకు చెందిన పలువురు నాయకులు, ఉద్యమ కారులు అభివర్ణించారు. శనివారం ప్రో. జయశంకర్ సార్ వర్ధంతిలో వారు నివాళులు అర్పించారు.

తెలంగాణ జన సమితి తాండూరు కన్వినర్ సోమశేఖర్ ఆధ్వర్యంలో టీవీవీ, ప్రజా సంఘాల నాయకులు ఇందిరా చౌరస్తాలో ఉన్న జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజం విజయ్ కుమార్, టీఎల్ఎఫ్ నాయకులు జైపాల్ రెడ్డి, టీవీవీ నాయకులు పర్యాద రామకృష్ణ, విద్యార్థి నాయకులు శ్రీనివాస్, ఆర్టీసీ నాయకులు మోదీన్, యల్‌శెట్టి, విజయ్ కుమార్, జీలకర్ర రవీందర్, శరణు, గౌరి, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

అదేవి ధంగా ఉద్యమ కారులు ఫిరోజ్ ఖాన్, నాగేందర్, జిలాని తదితరులు కూడా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మరోవైపు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు, వినోద్ కుమార్, అభిషేక్ తదితరులు జయశంకర్ సార్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సాధనకు ఊపిరి పోసిన మహనాయుడు జయశంకర్ సార్ అని కొనియాడారు. ఆయన ఉద్యమ స్ఫూర్తి అందరిలో చిరస్మరణీయంగా నిలుస్తుందని అన్నారు. జయశంకర్ సార్ ఆశయ సాధనకు అనుగుణంగా అందరు పోరాటం చేయాలని అన్నారు.

ఇదికూడా చదవండి…

