న్యాయవాదుల చట్టాలను అమలు చేయాలి
– మున్సిఫ్ కోర్టులో న్యాయవాదుల నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి: న్యాయవాదులపై జరుగుతున్న దాడులను నియంత్రించేందుకు న్యాయవాదుల పరిరక్షణ చట్టాలను అమలు చేయాలని తాండూరు మున్సిఫ్ కోర్టు న్యాయవాదులు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఓ న్యాయవాదిపై కొందరు రౌడీషీటర్లు హత్యాయత్నానికి పాల్పడడంపై బుధవారం తాండూరు మున్సిప్ కోర్టులో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. విధులు బహిష్కరించి.. నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు జరగడంపై అవేధన వ్యక్తం చేశారు. కక్షిదారుల పక్షనా పోరాటం చేసే న్యాయవాదుల కోసం అడ్వకేట్ ప్రోటక్షన్ యాక్టు(న్యాయవాదుల పరిరక్షణ చట్టం)ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె. శ్రీనివాస్, కార్యదర్శి పాశం రవికుమార్, కోశాధికారి నాదిర్గే సుదర్శన్, సీనీయర్ న్యాయవాదులు రవికుమార్, గోపాల్, చంద్రశేఖర్, చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్, గుండప్ప, నర్సప్ప, మహిళ న్యాయవాదులు రజిత, వాణిశ్రీ, మమత, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
