నాస్ సర్వేకు స్పందన
– పరీక్షలు రాసిన విద్యార్థులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: పాఠశాల విద్యార్థుల్లోని అభ్యసనా సామర్థ్యాలు, ప్రతిభను పరిరక్షించేందుకు నిర్వహించే నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే(నాస్)కు మంచి స్పందన లభించింది. 2014లో ఒకసారి ఈ సర్వే నిర్వహించగా.. ఏడేండ్ల
తర్వాత ఈ ఏడాది సర్వేను నిర్వహించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే సర్వే నిర్వహించగా..ఈసారి ప్రైవేట్ పాఠశాలలతోపాటు కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లోనూ నిర్వహించారు. శుక్రవారం తాండూరులోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు పరీక్ష విజయవంతంగా కొనసాగింది. పట్టణంలోని 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులు సర్వేను పూర్తి చేసేశారు. శుక్రవారం నిర్వహించిన నాస్ పరీక్ష ఫలితాలు కేంద్ర, రాష్ట్ర ఉన్నతశాఖ అధికారులకు చేరవేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

