అవకాశం ఇవ్వండి.. కాలనీని అభివృద్ధి చేస్తా
– సీసీఐ కాలనీలో కోట్రిక నాగలక్ష్మీ ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కౌన్సిలర్ గా అవకాశం ఇస్తే కాలనీలను అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం కోట్రిక నాగలక్ష్మీ తన భర్త కోట్రిక శ్రీకాంత్ తో కలిసి 24వ వార్డులోని సీసీఐ కాలనీల ప్రచారం చేశారు. వార్డు వార్డులోని ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. ఎన్నికల్లో తాను కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నానని తెలిపారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో గెలిపిస్తే కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అందరికి అందుబాటులోకి ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల్లో కౌన్సిలర్ గా అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, కోటబాస్పల్లి సర్పంచ్ స్వరూపా రెడ్డి, టైలర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

