బీపీ.. కంట్రోల్ ఈజీ..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ రాజకీయం హైదరాబాద్

బీపీ.. కంట్రోల్ ఈజీ..!
– మందులు వాడకుండా అదుపులో
– ఈ అలవాట్లు పాటిస్తే మీరు సేఫ్‌
– నిపుణులు సూచించిన సూత్రాలు మీకోసం
దర్శిని డెస్క్ : ప్రస్తుత జీవన శైలికి అలవాటు పడిన చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వాటిలో బీపీ సమస్య వారిలో మరింత డేంజర్‌ హింట్లను అందిస్తోంది. అయితే ఎలాంటి చెకప్ లేకుండా.. కొన్ని అలవాట్లతో బీపీని కంట్రోల్ చేయొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సహజంగానే బీపీని అదుపులో పెట్టుకునే సహజ మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
kvcs

వ్యాయామం అనేది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా బరువును అదుపులో పెట్టుకోవడానికి, గుండెను బలోపేతం చేయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా ఏరోబిక్ వ్యాయామం చేయడం వల్ల అధిక రక్తపోటు 5 నుంచి 8 mm Hg వరకు తగ్గుతుందని mayoclinic అధ్యయనంలో పేర్కొంది. రోజు తీసుకునే ఆహారంలో ఉప్పును కొద్దిగా తగ్గించడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు రక్తపోటు అదుపులో ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.

పొటాషియం అధికంగా ఉండే అరటిపండ్లు, పుచ్చకాయలు, నారింజ, అవకాడో, ఆకుకూరలు, బంగాళాదుంపలు, చిలగడదుంపలు, బీన్స్, పాలు, పెరుగు లాంటి ఆహార పదార్థాలు రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్నా వారు మాత్రం పొటాషియం కంటెండ్ ఎక్కువగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా మద్యం సేవించడం వల్ల రక్తపోటు పెరుగుతుందని, ఇది అదనపు కేలరీలను కూడా జోడిచడం వల్ల బరువు పెరగడానికి కారణమవుతుందని MedlinePlus అధ్యయనంలో పేర్కొంది. కావున మద్యం సేవించడాన్ని పరిమితం చేసుకోవాలి.

ఫిష్ ఆయిల్, మందార టీ, వే ప్రొటీన్, వెల్లుల్లి లాంటివి సహజ సప్లిమెంట్లను తీసుకోవాలి. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. చికెన్, డెయిరీ పదార్థాలు, కూరగాయలు, తృణ ధాన్యాలు లాంటివి డైలీ తినాలి. శారీరకంగా చురుకుగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ధూమపానం మానేయడం మంచింది. కాల్షియం సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. కెఫీన్ వాడకాన్ని తగ్గించడంలో పాటు డార్క్ చాక్లెట్, కొకొవా ఎక్కువగా తినాలి. ప్రాసెస్ చేసిన చక్కెర పదార్థాలు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు తగ్గించాలి. పాలీఫినాయిల్స్ ఎక్కువగా ఉండే బెర్రీలు తీసుకోవాలి. రోజుకు 7 నుంచి 8 గంటల పాటు హాయిగా నిద్రపోవాలి. ఈ సూత్రాలు పాటిస్తే బీపీని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు.

నోట్ : ఇందులోని అంశాలు అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది. ఏమైనా అనారోగ్య ఉంటే వైద్యులను సంప్రదించాలని మనవి.

ఇదికూడా చదవండి…

అందరిని బ్రోవు దత్తాత్రేయ స్వామి..!