ఫ్రీగా ఆయుష్మాన్ భారత్ కార్డు..!
– రూ. 5లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా
– ఇంటి నుంచే దరఖాస్తుకు అవకాశం
– 70 ఏండ్ల వృద్ధుల ఆరోగ్యానికి భరోసా
దర్శిని డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగానే ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) పథకాన్ని అమలు చేస్తోంది. ఇది అత్యంత సమగ్రమైన ఆరోగ్య బీమా పథకాలలో ఒకటి. వైద్య చికిత్సకు అయ్యే అధిక ఖర్చుల నుంచి ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలకు రక్షణ కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. పథకం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా ప్రత్యేకమైన కార్డులను అందిస్తోంది. దీనిలో ఎప్పటికప్పుడు ఆయుష్మాన్ కార్డును అప్ డేట్ చేస్తోంది. కవరేజ్ పరిధిని పెంచుతోంది.
70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ, ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కవరేజీని అందుతుంది. 70 యేళ్ల పైబడిన సీనియర్ సిటిజన్లకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీనియర్ సిటిజన్లకు ఆధార్ కార్డు ఉంటే చాలు.. సీనియర్ సిటిజన్లకు ఆదాయంతో సంబంధం లేకుండా ఈ పథకాన్ని వర్తింపజేస్తుంది. దీంతో దాదాపు 6 కోట్ల సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు
ఆయుష్మాన్ కార్డ్‌కు అర్హులు ఎవరంటే..?
వికలాంగ సభ్యులు, తాత్కాలిక నివాసాలలో నివసిస్తున్న లేదా చేతితో పని చేసే కార్మికులుగా పనిచేస్తున్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో, వీధి వ్యాపారులు, గృహ కార్మికులు, నిర్మాణ కార్మికులు, రిక్షా పుల్లర్లు వంటి తక్కువ-ఆదాయ కార్మికులు దరఖాస్తు చేసుకోవచ్చు. కార్మికులు, పట్టణ అనధికారిక కార్మికులు, గ్రామీణ కళాకారులు, భూమిలేని కార్మికులు, ఇతర తక్కువ-ఆదాయ వర్గాలు, వితంతువులు లేదా ఒంటరి తల్లులు, వారి పిల్లలు, వృద్ధులు, వికలాంగులందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అవకాశం ఉంది.
ప్రీగా దరఖాస్తు చేసుకోవడం ఇలా..
ఏబీపీఎంజేఏవై పథకంలో లబ్ధి పొందేందుకు పీఎంజేఏవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. PMJAY పోర్టల్‌లో ‘యామ్ ఐ ఎలిజిబుల్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. దీంతో beneficiary.nha.gov.in అనే వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ క్యాప్చా, మొబైల్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత కేవైసీ కోసం వివరాలు నమోదు చేసి.. ఆమోదం కోసం చూడాలి. ఆయుష్మాన్ కార్డు సిద్ధమైన తర్వాత అధికారిక ఆమోదం లభించిన వెంటనే బీమా కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధార్‌లో నమోదైన వయసు ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ధ్రువీకరణ పత్రాల్లో ఆధార్ ఒక్కటే సరిపోతుందని ఇటీవల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది.
కావాల్సిన పత్రాలు ఇవే…
పీఎంజేఏవైకి అర్హులు అని నిర్ధారణ అయిన తర్వాత ఈ-కార్డుకు ప్రయత్నించవచ్చు. కార్డు జారీ చేసే ముందు పీఎంజేఏవై దగ్గర మీ ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా రేషన్ కార్డు పరిశీలిస్తారు. కుటుంబ సభ్యుల గుర్తింపు నిర్ధారణ పత్రాలతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన సభ్యుల జాబితా పత్రాలు కూడా చూపాలి. అలాగే పీఎం లెటర్, ఆర్‌ఎస్‌బీవై కార్డులు కూడా చూపాలి. వీటిని పరిశీలించిన తర్వాత ఈ-కార్డు ప్రింట్ ఇస్తారు. ఆ కార్డును ప్రత్యేకంగా ఏబీ-పీఎంజేఏవై ఐడీతో ఇస్తారు.
ఇదికూడా చదవండి…

