స్టడీ అవర్స్‌పై ఫోకస్..!
– పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్దం చేయాలి
– జిల్లా ఇంటర్ నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ కాలేజీలో విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు స్టడీ అవర్స్ నిర్వహించేంలా దృష్టిసారించాలని వికారాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ ఆపీసర్ ఎన్. శంకర్ నాయక్ అన్నారు. మంగళవారం తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీని తనిఖీ చేశారు. ఇంచార్జ్ ప్రిన్సిపల్ మల్లినాథప్ప ఆధ్వర్యంలో కాలేజీ అద్యాపకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ అడ్మిషన్ల పరంగా తాండూరు ప్రభుత్వ కాలేజీ టాప్‌లో ఉండడం, అవార్డు కూడా రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా పాఠశాలలో అద్యాపకులు, విద్యార్థులు సమయ పాలన పాటించాలన్నారు. విద్యార్థులు సక్రమంగా తరగతులకు వచ్చేలా చూడాలన్నారు.

విద్యార్థుల్లో మెథస్సును పెంచేందుకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలన్నారు. సైన్స్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి నీట్, జేఈఈ పోటీ పరిక్షలకు సన్నద్దం చేయాలన్నారు. ప్రతి శుక్ర, శనివారాల్లో ఆట పాటలతో ఉత్సహాం నింపాలన్నారు. ప్రభుత్వ కాలేజీలో విద్యార్థులకు ప్రైవేటు కాలేజీలకంటే ధీటుగా విద్యను అందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

