కట్ట మైసమ్మ బోనాల జాతర ఉత్సవాలకు రండి

తాండూరు రాజకీయం వికారాబాద్


కట్ట మైసమ్మ బోనాల జాతర ఉత్సవాలకు రండి

– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఆహ్వానం
– విఠల్ నాయక్ ఆధ్వర్యంలో కలిసిన సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఆదర్శనగర్ లోని కట్టమైసమ్మ బోనాల జాతర ఉత్సవాలకు రావాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కమిటీ సభ్యులు ఆహ్వానించారు. శుక్రవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మార్కెట్ కమిటి, మాజీ చైర్మన్ విఠల్ నాయక్ ఆధ్వర్యంలో దేవాలయ కమిటి సభ్యు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈనెల 20, 21వ తేదిలలో దేవాలయంలో ప్రతి యేడాది మాదిరిగానే ఆషాడం బోనాలు, జాతర ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఉత్సవాలకు తప్పక రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు జుంటుప వేణుగోపాల్, కంఠం నవీన్, ప్రకాష్, అంజిలయ్య, రాములు, ఆలయ ప్రధాన అర్చకులు జంగం చంద్రకాంత్ స్వామి తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

తాండూరు కాలేజీకి రాజయోగం..!