ముంబై రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

ముంబై రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..!
– ఆ రైళ్లకు పెరగనున్న స్లీపర్ కోచ్‌లు
– ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ – తాండూరు మీదుగా ముంబై వెళ్లే రైల్వే ప్రయాణికులకు రైల్వే అధికారులు గుడ్‌ న్యూస్ చెప్పారు. వచ్చే నెల నుంచి ముంబై వెళ్లే రైళ్లకు అదనంగా స్లీపర్ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

ముంబై వెళ్లేందుకు ప్రయాణికులు రైళ్లు మార్గానికి ప్రాధాన్యమిస్తారు. ముంబై, పూణే, షోలాపూర్ తదితర ప్రాంతాలకు వ్యాపారులు వెళుతుంటారు. బతుకుదెరువు కోసం వెళ్లే వారు కూడా చాలా మంది ఉంటారు. అయితే రైళ్లకు స్లీపర్ కోచ్‌లు అదికంగా లేకపోవడంతో ఇబ్బందులు పడేవారు. దక్షణ మద్య రైల్వే శాఖ కొన్ని రైళ్లకు స్లీపర్‌ కోచ్‌లను పెంచాలని నిర్ణయించింది.

హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే ముంబై ఎక్స్‌ప్రెస్(22731), హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(22732)లకు సెప్టెంబర్ 23, 26వ తేదిలలో అదనంగా రెండు స్లీపర్ కోచ్‌లను అమర్చనున్నట్లు తెలిపారు. దీంత పాటు హుస్సేన్ సాగర్(12072/12071) రైలుకు 24, 25వ తేదిలలో అదనంగా రెండు స్లీపర్ కోచ్‌లను అమర్చి అందుబాటులోకి తీసుకరానున్నారు. ఈ బోగిలు పెరిగితే ముంబై ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా సేవలు అందడం జరుగుతాయి.

ఇదికూడా చదవండి….

కమీషన్ల ఆశతో కాగ్నానదిపై నిర్లక్ష్యం..!