రేపే డీప్యూటీ సీఎం రాక..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపే డీప్యూటీ సీఎం రాక..!
– మంత్రుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
– ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– శంకుస్థాపన చేయనున్న అభివృద్ధి పనులు ఇవే..
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో రేపు పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటనకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఉదయం డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్పీకర్ ప్రసాద్ కుమార్, చీఫ్ విప్ మహేందర్ రెడ్డిలు పర్యటించనున్నారు.

యాలాల మండలంలోని జుంటుపల్లి సీతారామ స్వామి దేవాలయంలో డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూజలు చేయనున్నారు. అనంతరం రూ.200ల కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూళ్ కు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలోని పలు మండలాలకు మంజూరైన 6 విద్యుత్ సబ్ స్టేషన్ లకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం తాండూరు పట్టణంలో రూ.7 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులతో పాటు స్వాగత తొరణాల బోర్డులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని జీపీఆర్ గార్డెన్ లో తాండూరు మండలం, తాండూరు పట్టణం, పెద్దేముల్ మండలాలకు చెందిన లబ్దిదారులకు మంజూరైన కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు.

ఈ సందర్భంగా సోమవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. విద్యుత్ అధికారులు, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. జీపీఆర్ గార్డెన్ లో రేషన కార్డుల పంపిణీ కార్యక్రమంతో పాటు ప్రజా సభ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, కోట్ పల్లి మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి. మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు శాఖల అధికారులు ఉన్నారు.

ఇదికూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి