దోపిడి సర్కారును దించుడే..!
– కారు టైం అయిపోయింది, కాంగ్రెస్ టైం వచ్చింది
– కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇంటింటా సంక్షేమం, సౌభాగ్యం
– ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి
– తాండూరు పట్టణంలో జోరుగా ఎన్నికల ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దోపిడికి పాల్పడుతున్న సర్కారును దించేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ పరిధిలోని మల్ రెడ్డిపల్లి, ఇందిరానగర్ కాలనీల్లోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ ప్రచారంలో డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి స్థానిక పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఆయన వార్డుల్లోని ఇంటింటికి తిరిగారు. పెద్దలను, వృద్ధులను, మహిళలను కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. వృద్ధులు, మహిళలు మనోహర్ రెడ్డికి ఆశీర్వాదాలు అందించారు.
పాదయాత్రలో మనోహర్ రెడ్డి చేయి చూపిస్తూ అభివాదం చేశారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 9 ఏండ్లు పాలించిన బీఆర్ఎస్ సర్కారు దోపిడికి పాల్పడిందన్నారు. తాండూరు ఎమ్మెల్యే కూడా నియోజకవర్గంలో దగా, దోపిడి పాలన సాగించారని అన్నారు. ఇప్పుడు కారు టైం అయిపోయింది.. కాంగ్రెస్ టైం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం ఆరు గ్యారెంటీ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇంటింటికి సంక్షేమం, సౌభాగ్యం వస్తుందన్నారు. ఎన్నికల్లో అందరు హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్, ఫ్లోర్ లీడర్ మధుబాల, కౌన్సిలర్ భీంసింగ్, మాజి కౌన్సిలర్ శ్రీనివాస్, పార్టీ నాయకులు బాతుల బీమ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

