కాంగ్రెస్ పార్టీకి షాక్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ పార్టీకి షాక్..!
– బీఆర్ఎస్ పార్టీలో చేరిన డివై నర్సింలు
– ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డివై నర్సింలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

శనివారం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీని వీడిన డివై నర్సింలుకు రోహిత్ రెడ్డి గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చనందుకు గ్రామాల్లో ప్రజలు నిలదీస్తున్నారని వారికి ఏం చెప్పాలో తెలియక పార్టీని వీడుతున్నట్లు డివై నర్సింలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సాయిపూర్ నర్సింలు, మండల పార్టీ అధ్యక్షుడు కోహీర్ శ్రీనివాస్, నరేష్ రెడ్డి, షిబ్లీ, రంగయ్య, ప్రసాద్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

కాంగ్రెస్ నేతల సామాజిక సేవకు జేజేలు