మున్సిపల్ కార్మికులకు రాఖీ..!
– విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంబరాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులతో రాఖీ పండగ సంబరాలు జరుపుకున్నారు.

శనివారం రాఖీ పౌర్ణమి సందర్బంగా విశ్వహిందూ పరిషత్ వికారాబాద్ జిల్లా సామాజిక సమరత విభాగం ఆధ్వర్యంలో పండగ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు పారిశుద్ధ్య కార్మికులకు రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం పలువురు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులే పరిశుభ్రత రక్షకులు అని వారి సేవలను కొనియాడారు. పట్టణ పారిశుద్ధ్యానికి తోడ్పడే కార్మికులతో వేడుకలు జరపుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ శానిటరి ఇనుస్పెక్టర్ వెంకటయ్య, విశ్వహిందూ పరిషత్, సామాజిక సమరత విభాగం సభ్యులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

