సీఎం రేవంత్ రెడ్డితో మనోహర్ రెడ్డి భేటీ

తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎం రేవంత్ రెడ్డితో మనోహర్ రెడ్డి భేటీ
– బైపాస్ రైతులకు పరిహారంపై చర్చ
– కాగ్నా నది తాగునీటి పైపులైన్ నిధులకు విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భేటి అయ్యారు.
kvcs
మంగళవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాండూరులో చాలా ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న బైపాస్ రోడ్డు విషయంపై చర్చించారు. బైపాస్ రోడ్డు విషయంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం సక్రమంగా అందక పనులు జరగడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం అందించాలంటే రూ.25 కోట్ల అవసరం ఉందని వివరించారు.

అదేవిధంగా తాండూరు పట్టణంలో స్వాతంత్రంకు పూర్వం ఉన్న పైపులైన్ వ్యవస్థ వల్ల తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతన్నాయని తెలిపారు. కాగ్నా నది నుంచి కొత్త పైపులైన్ వ్యవస్థ నిర్మాణంకు సుమారు రూ.50 కోట్ల నిధులతో ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. తాండూరు నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. తాండూరు సమస్యలపై స్పందించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

స్పందించిన అధికారులు..!