సహాకార సంఘాల పాలకవర్గాలకు ఊరట..!
– పదవి కాలం పొడగిస్తూ ఉత్తర్వులు జారీ
– హర్షం వ్యక్తం చేస్తున్న చైర్మన్లు, వైస్ చైర్మన్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సహాకార సంఘాల పాలకవర్గాలకు ప్రభుత్వం నుంచి ఊరట కలగించే వార్తను అందించింది. పాలకవర్గ పదవికాలం పొడగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

ప్రభుత్వ ఉత్తర్వులతో జిల్లాలోని వికారాబాద్, పరిగి, కోడంగల్, తాండూరు నియోజకవర్గంలోని పాలకవర్గాల చైర్మన్లు, వైస్ చైర్మన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పీఏసీఎస్ పాలకవర్గాల పదవి కాలం గత యేడాది ముగిసింది. అప్పట్లోనే ప్రభుత్వం పాలకవర్గాల పదవి కాలాన్ని మొదటిసారి పొడగించింది. ఆరు నెలల పాలు కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ గడువు ఈనెల 14 గురువారంతో ముగిసింది. అయితే ప్రభుత్వ పీఏసీఎస్ పాలకవర్గాల పదవి కాలం పొడగిస్తుందా లేదా అనే సందేహం ఏర్పడింది. వీటన్నింటికి తెరతీస్తూ ప్రభుత్వం గురువారమే ఉత్తర్వులను జారీ చేసింది. సహాకార సంఘాల పదవి కాలాన్ని రెండో సారి పొడగించేందుకు నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు సహాకార సంఘాల పదవి కాలాన్ని మరో ఆరు నెలలు పొడగిస్తున్నట్లు ఉత్తర్వులలో స్పష్టం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సహాకార సంఘాల చైర్మన్లు, వైస్ చైర్మన్, డైరెక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయంతో సహాకార సంఘాల బలోపేతానికి మరింత కృషి చేస్తామని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

ఇదికూడా చదవండి…

