శ్రీ సాయి మేధలో కన్నుల పండుగగా కృష్ణాష్టమి వేడుకలు

తాండూరు రాజకీయం వికారాబాద్

శ్రీ సాయి మేధలో కన్నుల పండుగగా కృష్ణాష్టమి వేడుకలు
– ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీ సాయి మేధా విద్యాలయంలో కృష్ణాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి శ్రీకృష్ణనికి ప్రత్యేక పూజలు చేశారు.

చిన్ని కృష్ణున్ని ఉయ్యాలలో వేసి టీచర్లు పాటలు పాడుతూ డోలారోహణం చేశారు. విద్యార్థులు శ్రీకృష్ణ, గోపికల వేషధారణలో చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. ఉట్టి కొట్టే కార్యక్రమంలో వేషాదరణ చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీపడుతూ పెరుగు ఉట్టిని పగలగొట్టారు. దీంతో విద్యాలయ ప్రాంగణం పండుగ వాతావరణంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, డైరెక్టర్లు మంజుల రెడ్డి, కల్పన, ప్రిన్సిపల్ సజిత, వైస్ ప్రిన్సిపల్ నవీన్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సర్కారుతో తేల్చుకోవడమే..!