విలియంమూన్ స్కూల్‌ ఆస్తులకు రక్షణ

తాండూరు రాజకీయం వికారాబాద్

విలియంమూన్ స్కూల్‌ ఆస్తులకు రక్షణ
– రూ. 84లక్షల నిధులు మంజూరు
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని విలియంమూన్‌ స్కూల్ ఆస్తులకు రక్షణ లభించింది. గత కొన్ని రోజులుగా విలియంమూన్‌ స్కూల్‌కు చెందిన స్థలం విషయంలో వివాదం జరిగిన సంగతి తెలిసిందే.
kvcs
ఆస్తుల రక్షణలో భాగంగా తాండూరు క్రిస్టియన్ మైనార్టీ అసోసియేషన్ అధ్యక్షులు వి. కిరణ్‌ కుమార్ ఆధ్వర్యంలో మెథడిస్ట్ సంఘం సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిశారు. ఇందుకోసం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విలియమూన్ ఆస్తులకు ప్రహారి(కంపౌండ్‌)గోడ నిర్మాణం కోసం రూ. 84లక్షలు నిధులు మంజూరు చేశారు.

ఈ విషయాన్ని కిరణ్‌ కుమార్ వెల్లడించారు. విలియంమూన్ ఆస్తుల రక్షణకు తోడ్పాటు అందించడం పట్ల కిరణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని శాలువా, పూలమాలతో సన్మించారు. ఈ కార్యక్రమంలో మెథడిస్ట్ సంఘం సభ్యులు డిఎస్ కిష్టఫర్, రాజు, దినకర్, రవి, డప్పు శ్రీను, జోసఫ్‌, చింటు రాజ్, ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ప్రతిశాఖలో అవినీతి రాజ్యం..!