పండగలు నిర్విఘ్నంగా నిర్వహించాలి
– హిందూ ఉత్సవ సమితికి తోడ్పాటు అందిస్తాం
– రాష్ట్ర చీఫ్ విప్, తాండూరు ఎమ్మెల్యే హామీ
– మర్యాదపూర్వకంగా కలిసిన సమితి సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే వినాయక చవితితో పాటు అన్ని పండగలను నిర్విఘ్నంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు సూచించారు.

గురువారం తాండూరు హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో హైదరాబాద్ లో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు వేరు వేరుగా వారి వారి నివాసాల్లో సమితి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలను సన్మానించారు. హిందూ ఉత్సవ సమితి అభివృద్ధికి సహకరించాలని సమితి సభ్యులు వారిని కోరారు.

ఇందుకు చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హిందూ ఉత్సవ సమితి అభివృద్ధికి తమవంతూ తోడ్పాటు, సహాకారం అందిస్తామని అన్నారు. హిందూ ఉత్సవ సమితి హర్షం వ్యక్తం చేస్తూ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి రొంపల్లి సంతోష్, ఉపాధ్యక్షులు గూలి పరమేశ్వర్ స్వామి, శ్రీకాంత్ రెడ్డి, సహాయ కార్యదర్శులు వెంకటేశం(మిర్చి), మంతన్ గౌడ్ అశోక్, కోట్ల రాజ్ కుమార్, అధికార ప్రతినిధి పర్యాద రామకృష్ణ, సాంస్కృతిక కార్యదర్శులు దావులయ్య, దేవగారి రమేష్, ప్రచార కార్యదర్శులు కుమార్ వాల్మీకీ, గోపాల్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

