విఠల్ నాయక్‌కు లక్కీ చాన్స్..!
– తాండూరు ఏఎంసీ చైర్మన్‌గా పదవికాలం పొడగింపు
– ఆరునెలలు పొడగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ
– పాలకవర్గ సభ్యుల పదవికాలం కూడ ముందుకు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి ప్రస్తుత పాలకవర్గానికి మంచి చాన్స్ లభించింది. మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్‌తో పాటు వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, డైరెక్టర్ల పదవికాలం పొడగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత మార్కెట్ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డిలతో పాటు డైరెక్టర్ల పదవి కాలం ఈనెల 20తో ముగియనుంది. ఈనెల 20తోనే చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, డైరెక్టర్లు పదవి చేపట్టి ఏడాది పూర్తికావోస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తెలంగాణ మార్కెట్ చట్టంను అనుసరిస్తూ ప్రస్తుత పాలకవర్గ పదవి కాలాన్ని మరో ఆరు నెలలు పొడగిస్తున్నట్లుగా ఏపీసీ అండగ్ సెక్రటరి ఎం.రఘునందన్‌రావు ఉత్తర్వులను జారీ చేశారు. మరోవైపు చైర్మన్‌గా తనతో పాటు వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యుల పదవి కాలాన్ని పోడగించడంపట్ల విఠల్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకుగాను సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి రుణపడి ఉంటామని, ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
