భళా.. బుయ్యని సరళా రెడ్డి..!

కెరీర్ తాండూరు రాజకీయం లైఫ్-స్టైల్ వికారాబాద్


భళా.. బుయ్యని సరళా రెడ్డి..!

– ఉత్తమ వ్యాపారవేత్తగా ‘బెస్ట్’ అవార్డు
– కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రధానం
– బుయ్యని ఫ్యామిలికి అభినందనల వెల్లువ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు, సామాజిక సేవకురాలు బుయ్యని సరళా రెడ్డి భళా అని పలువురు కీర్తిస్తున్నారు.

తాండూరులోని ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీ ఎండీగా తెలుగు రాష్ట్రాలలో ఉత్తమ వ్యాపార వేత్తగా అవార్డును అందుకుకోవడం విశేషం. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో ప్రైవేటు మీడియా సంస్థ ఆధ్వర్యంలో బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ – 2025 కార్యక్రమం నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ డా.జాటోత్ రాంచందర్ నాయక్, ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ లు హాజరయ్యారు.
kvcs
తెలుగు రాష్ట్రాలలోని వివిధ వ్యాపార రంగాల్లో రాణిస్తున్నవారికి ఉత్తమ అవార్డులు అందజేశారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రా ల్లో సుస్థిరమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన ఆర్బీఓఎల్ ప్యాక్టరీ ఎండీ బుయ్యని సరళా రెడ్డికి బెస్ట్ క్సలెన్స్ అవార్డ్ దక్కింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా బుయ్యని సరళా రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.

వికారాబాద్ జిల్లాలో మామూలు స్థాయి నుంచి తెలుగు రాష్ట్రాల స్థాయిలో సుస్థిర వ్యాపారంతో ఉత్తమ అవార్డులు అందుకునే స్థాయికి ఎదిగిన బుయ్యని సరళా రెడ్డి భళా అని పలువురు ప్రశంసిస్తున్నారు. ఉత్తమ అవార్డు అందుకున్న సరళా రెడ్డి శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువలా తెలిపారు.

ఇదికూడా చదవండి…

మీ ఇంటి ఫోటో మీరే తీయండి..!