మా స్కూల్‌కి కిచెన్ లేదు..!
– మధ్యాహ్న భోజనానికి కష్టాలు
– బోరులేక విద్యార్థులకు ఇబ్బందులు
– సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : గత పదేళ్లుగా మా పాఠశాలలో వంటగది అందుబాటులో లేక మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జొన్నల వినోద్ తెలిపారు.

శనివారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులకు ఆయన వినతిపత్రం అందజేశారు. గత పదేళ్లుగా పాఠశాలలో వంటగది లేదని, ఉన్న గది నిరుపయోగమారడంతో మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. దీంతో పాటు బోరు కూడా లేకపోవడంతో తాగునీటికి విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఈ సమస్యల వల్ల పాఠశాల అభివృద్ధిపై ప్రభావం పడుతుందని, కావున పాఠశాలలో వంటగదిని నిర్మించాలని, నీటి అవసరాల కోసం బోరు మోటారు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

