నామినేషన్ వేసిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
రంగారెడ్డి, దర్శిని ప్రతినిధి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలెట్ రోహిత్ రెడ్డి, ప్రకాష్ గౌడ్‌లతో కలిసి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి నామినేషన్ వేశారు. తన నామినేషన్ పత్రాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమోయ్ కుమార్‌కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులుగా సీఎం కేసీఆర్ శంబీపూర్ రాజు, పట్నం మహేందర్‌రెడ్డిలను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కాగా ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మహేందర్ రెడ్డి పదవి కాలం జనవరి 4తో ముగిసిపోనుంది.
