జెడ్పీటీసీ రేసులో న్యాయవాది..!
– యాలాల మండలం నుంచి పోటీ..?
– మండల నేతల ద్వారా మద్దతు
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌తో యాలాల మండలంలో జోరు పెరిగింది. మండలం నుంచి జెడ్పీటీసీ స్థానం బీసీ జనరల్‌కు దక్కడంతో ఆశావాహులు కన్నెశారు.

ఈ పోటీలో ప్రముఖ న్యాయవాది పేరు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. ఈ పరిణామం మండల రాజకీయాల్లో ఊహించని చర్చకు దారి తీసింది. తాండూరులో ప్రముఖ న్యాయవాది నర్సింగ్ రావు యాలాల జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసేందుకు ఉత్సహాం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. న్యాయవాదిగానే కాకుండా ప్రజల సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండే ఆయన పోటీ చేస్తే మద్దతు తెలిపేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు.

దీనికి తోడూ ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులు కూడా న్యాయవాది నర్సింగ్ రావు ఉన్నట్లు ప్రచారం. అంతేకాకుండా న్యాయవాది నర్సింగ్ రావు బాల్యమిత్రుడు, ప్రముఖ వ్యాపార వేత్త, సీనీయర్ నాయకులు భీంశెట్టి అనిల్ కుమార్ కూడా పూర్తి మద్దతు ఇస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అందరి మద్దతు, ఆశీస్సులలో ప్రముఖ న్యాయవాది నర్సింగ్ రావు జెడ్పీటీసీ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ప్రజా న్యాయం కోసం, గ్రామాల అభివృద్ధి కోసం, అన్యాయానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన ఈ న్యాయవాది, ఇప్పుడు రాజకీయ వేదికపై ప్రజా సేవకు సిద్ధమవడంతో మండల రాజకీయాల్లో ఇది గేమ్ ఛేంజర్ అవుతుందని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు.

ఇదికూడా చదవండి….

