కాంగ్రెస్ పార్టీ పటిష్ఠానికి కృషి
– జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభారాణి
– ఘనంగా సన్మానించిన నేతలు
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ పటిష్ఠానికి తన వంతు కృషి చేస్తానని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షురాలు కందనెల్లి శోభారాణి పేర్కొన్నారు. సోమవారం పెద్దేముల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా మహిళ అధ్యక్షురాలుగా ఎన్నికైన కందనెల్లి శోభారాణిని పార్టీ మండల అధ్యక్షులు గోపాల్, పెద్దేముల్ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారిలతో పాటు మాజీ ఎంపీపీ సంతోషి రవిశంకర్, రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ రియాజ్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల ప్రవీణ్ కుమార్, ఎన్ఎస్‌యూఐ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి రాములు నాయక్. మాజీ ఎంపిటిసి డాక్టర్ రమేష్ కుమార్ పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభారాణి మాట్లాడుతూ అందరి సహాకారంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని పేర్కొన్నారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు నియమించిన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతా రావు, మాజీ మంత్రులు ప్రసాద్ కుమార్, జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, పీసీసీ డెలికేట్ ధారాసింగ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ…. ప్రజా సమస్యలపై పోరాడే నాయకులకు, మహిళ నాయకులకు కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, మాజీ ఉప సర్పంచ్ గోపాలకృష్ణ, డివై నర్సములు, ఆనందచారి, రామప్ప, మహిళ నాయకులు కృష్ణవేణి, రాధిక, కవిత, మంజుల, ప్రమీల, నాగరాణి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

