జడ్జీ ఆదేశాలతో డ్రైనేజి గుంత మూసివేత

తాండూరు వికారాబాద్

జడ్జీ ఆదేశాలతో డ్రైనేజి గుంత మూసివేత
– సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : దాదాపు గత రెండేళ్లుగా తవ్వి వదిలేసిన డ్రైనేజీ గుంతకు మోక్షం లభించింది. తాండూరు న్యాయమూర్తి టీ.స్వప్న ఆదేశాలతో ఈ గుంతను మూసివేశారు. వివరాల్లోకి వెళితే… గత కొన్ని నెలల క్రితం తాండూరు ఆర్టీసీ బస్టాండ్, కోర్టు రోడ్డు మార్గంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద రోడ్డును ధ్వంసం చేశారు. అక్కడి డ్రైనేజీపై భారీ గుంతను త‌వ్వి వ్యర్థాలను అలాగే వదిలేశారు. దీన్నిపై పలువురు సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. పట్టించుకోకపోవడంతో తాండూరు బార్ అసోసియేషన్ సభ్యులు ఇటీవలే మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి టీ. స్వప్న దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన న్యాయమూర్తి టీ.స్వప్న సంఘటనా స్థలానికి నడుచుకుంటూ వచ్చి పరిశీలించారు. వెంటనే న్యాయమూర్తి టీ.స్వన్న మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి టీ.స్వప్న రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించి తీరాలని ఆయా శాఖ‌ల‌ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం మున్సిపల్ అధికారులు డ్రైనేజీ గుంతను మూసి వేశారు. ఇన్నాళ్లు ఈ మార్గంలో వెళుతున్న వాహనదారులు, ప్రజలు గుంతను మూసివేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కావడంతో బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయమూర్తికి ధన్యవాదాలు తెలిపారు.

కింది వ‌ర‌కు చూడండి…