రిజర్వేషన్ల స్టేకు కారకులు వాళ్లే…!

తాండూరు రాజకీయం వికారాబాద్

రిజర్వేషన్ల స్టేకు కారకులు వాళ్లే…!
– బీజేపీ, బీఆర్ఎస్ పార్టిల కుమ్మక్కు
– బీసీలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీనే
– యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో స్టే రావడానికి కారుకులు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలే అని యూత్ కాంగ్రెస్ తాండూరు పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ అన్నారు.

శనివారం ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీల రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని అన్నారు. ప్రభుత్వం సుప్రీంకోర్టులో బలమైన వాధనలు వినిపించి బీసీలకు న్యాయం జరిగేలా దృష్టిసారిస్తుందని అన్నారు. న్యాయస్థానం స్టే విధిస్తుందని అనుకోలేదని తెలిపారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు హైకోర్టులో వేసిన కేసులో ఎందుకు ఇంప్లీడ్‌ కాలేదో బీసీలకు జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ రెండు పార్టీలు కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నాయన్నారు.
kvcs
బీసీ రిజర్వేషన్ల బిల్లును గవర్నర్‌ ఆమోదించకపోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కేసులు వేయించింది బీఆర్‌ఎస్‌ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మాటకు కట్టుబడిందని, 42 రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. బీసీలెవరూ అధైర్యపడవద్దన్నారు. రిజర్వేషన్లకు ఎవరు అడ్డుపడుతున్నారో తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని కోరారు.

ఇదికూడా చదవండి…

బీసీలపై బీఆర్ఎస్, బీజేపీలకు చిత్తశుద్ది లేదు