ఆక్రమణలపై కొరడా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆక్రమణలపై కొరడా..!
– శివాజీ చౌరస్తాలో కూల్చివేతలు
– అభ్యంతరం తెలిపిన వ్యాపారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శివాజీ చౌరస్తాలో మున్సిపల్ అధికారులు ఆక్రమణలపై కొరడా జులిపించారు. శుక్రవారం మల్ రెడ్డిపల్లి రోడ్డు మార్గంలో ఉన్న దుకాణాల ముందు ఆక్రమణలను తొలగించారు. ఇటీవల కాలనీకి చెందిన మున్సిపల్ అధికారులకు అక్రమణపై ఫిర్యాదులు చేశారు. మల్ రెడ్డిపల్లి రోడ్డు మార్గంలోని మటన్, చికెన్ షాపుల యజమానులు డ్రైన్ లపై కట్టడాలు చేసుకున్నారని తెలిపారు.

దుకాణాల వద్ద రద్దీ ఎక్కువగా ఉండడంతో రోడ్డు ఇరుకుగా మారుతుందని, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కూల్చివేతలు చేసేందుకు యత్నించారు. దీంతో వ్యాపారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులకు, వ్యాపారుల మద్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులు కూడా అక్కడే ఉండంతో పరిణామాలు ఉద్రిక్తంగా మారాయి.
kvcs
పలువురు నాయకులు కూడా అక్కడికి చేరుకుని అధికారులతో వాదనకు దిగారు. వ్యాపారులు కమీషనర్ యాదగిరితో ఫోన్లో మాట్లాడారు. కమీషనర్ ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు దగ్గరుండి ఆక్రమణలను కూల్చివేశారు. ప్రస్తుతం పాక్షికంగా కూల్చివేతలు చేసి.. పూర్తిగా కూల్చివేసేందుకు గడువు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంచార్జ్ శానిటరీ ఇను స్పెక్టర్లు వెంకటయ్య, ఉమేష్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు వంశి, నరేష్, శాంతిప్రియ, సిబ్బంది వెంకటయ్య, భూతి, పోలీసు అధికారులు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

రిజర్వేషన్ల స్టేకు కారకులు వాళ్లే…!