టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు అందరు కృషి చేయాలి
– పెద్దేముల్ మండల పార్టీ అధ్యక్షుడు కోహీర్ శ్రీనివాస్ యాదవ్
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: టీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని ఆ పార్టీ పెద్దేముల్ మండల అధ్యక్షుడు కోహీర్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన
విలేకరుల సమావేశంలో ఆయన మండలంలోని గ్రామ కమిటీల అధ్యక్షుల, కార్యదర్శులను ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కమిటీలు ప్రకటించడం జరిగిందని తెలిపారు. గతంలో కొంతమంది వేసిన కమిటీలు చెల్లవని చెప్పారు. కొత్తగా నియామకమైన కమిటీల సభ్యులు పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. సర్కారు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులకు పథకాల ఫలాలు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమితి అధ్యక్షులు కృష్ణ గౌడ్, ఉపాధ్యక్షులు గోపాల్, సీనియర్ నాయకులు ఉపేందర్, ప్రకాశం, గ్రామ కమిటి అధ్యక్షులు డీవై ప్రసాద్, రవి, వెంకట్, జైరాం నాయక్, రఘు తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ గ్రామకమిటిలు ఇవే
పెద్దేముల్: అధ్యక్షులు గా డివై. ప్రసాద్ బాబు, జనరల్ సెక్రెటరీగా మామిళ్ల వెంకట్
బాయిమీది తాండ: అధ్యక్షులుగా రాథోడ్ రామ్ నాయక్, జనరల్ సెక్రటరీ విఠల్
ఊరేంటి తాండ: అధ్యక్షులుగా చౌవాన్ తుకారాం, జనరల్ సెక్రటరీగా గోపాల్ రాథోడ్
పాషాపూర్: అధ్యక్షులుగా రెడ్యా నాయక్, జనరల్ సెక్రెటరీగా రాములు నాయక్
ఓమ్లా నాయక్ తాండ: అధ్యక్షులుగా విజయ్ కరోబారి, జనరల్ సెక్రటరీగా రవి
జైరాం తాండ(ఓ): అధ్యక్షులుగా రాథోడ్ జై రామ్ నాయక్, జనరల్ సెక్రటరీగా సంతోష్
తట్టేపల్లి: అధ్యక్షులుగా ఎండి ఖదీర్, జనరల్ సెక్రెటరీ దేవేందర్ నాయక్
బండమిదిపల్లి: అధ్యక్షుడిగా బోయిని మల్లేశం, జనరల్ సెక్రటరీ మున్నూరు ప్రవీణ్
సిద్దన్న మడుగు తాండ: అధ్యక్షుడిగా బొజ్జా, జనరల్ సెక్రెటరీ బైసీ
ఎర్రగడ్డ తాండ: అధ్యక్షులుగా కిరాసింగ్, జనరల్ సెక్రటరీ శంకర్
అత్కూర్: అధ్యక్షులుగా శివ కుమార్, జనరల్ సెక్రెటరీగా అశోక్
హన్మాపూర్: అధ్యక్షులుగా వెంకటేష్, జనరల్ సెక్రెటరీ లాలప్ప
గిర్మాపూర్: అధ్యక్షులుగా రామ్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ రాంచందర్ నాయక్
గోట్లపల్లి: అధ్యక్షులుగా శ్రీశైలం, జనరల్ సెక్రెటరీ ఎండి రఫీక్
గాజీపూర్: ముస్తఫా, జనరల్ సెక్రెటరీగా వెంకటేష్ గౌడ్
బుద్దారం: అధ్యక్షులుగా శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీగా గోపాల్ రెడ్డి
కందనెల్లి: అధ్యక్షులుగా బోయిని శ్రీశైలం, జనరల్ సెక్రెటరీ ఇస్మాయిల్
ఖానపూర్: అధ్యక్షులుగా విష్ణువర్ధన్, జనరల్ సెక్రెటరీ గోపాల్ రెడ్డి
మంబాపూర్: అధ్యక్షులుగా కుర్వ దస్తప్ప, జనరల్ సెక్రెటరీ గోవర్ధన్ రెడ్డి
చైతన్య నగర్: అధ్యక్షులుగా ఆంజలయ్య, జనరల్ సెక్రటరీగా మొగులప్ప
దుగ్గపూర్: అధ్యక్షులుగా సుధాకర్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా వెంకటయ్య
మారేపల్లితండ: అధ్యక్షులు రాములు నాయక్, జనరల్ సెక్రెటరీగా మోతిలాల్
మన్ సాన్ పల్లి: అధ్యక్షులుగా మాన్య నాయక్, జనరల్ సెక్రెటరీగా గోపి
మధనంతాపూర్: అధ్యక్షులుగా చందర్, జనరల్ సెక్రటరీగా శ్రీనివాస్
కొండాపూర్: అధ్యక్షులుగా బోయిని ఆశప్ప, జనరల్ సెక్రటరీ మహిపాల్
రేగోండి: అధ్యక్షులుగా చంద్రయ్య, జనరల్ సెక్రటరీగా వెంకటయ్య
రుక్మాపూర్: అధ్యక్షులుగా సురేందర్, జనరల్ సెక్రెటరీ జానం రవి
జనగాం: అధ్యక్షులుగా ముకుందరెడ్డి, జనరల్ సెక్రెటరీగా శ్యామల్
మారేపల్లి: అధ్యక్షులుగా నర్సిరెడ్డి, జనరల్ సెక్రెటరీ విక్రమ్ రెడ్డి
రుద్రారం: అధ్యక్షులుగా ఎర్రం నరేందర్, జనరల్ సెక్రటరీ రాజేందర్ ప్రసాద్
గోపాల్ పూర్: అధ్యక్షులుగా బోనీ జనార్ధన్, జనరల్ సెక్రెటరీగా రాములు
నాగులపల్లి: అధ్యక్షులుగా రాంరెడ్డి, జనరల్ సెక్రటరీగా మున్నూరు బందేశ్