యువకుడికి మెరుగైన వైద్యం అందించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

యువకుడికి మెరుగైన వైద్యం అందించాలి
– తెలంగాణ రాష్ట్ర చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి
– చంద్రవంచ ప్రమాద యువడికి పరామర్శ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడికి మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి అన్నారు.

తాండూరు మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన చింతల కాడి జగదీష్ ఆటోలో వెళుతుండగా బొల్తాపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. కుటుంభీకులు వికారాబాద్ లోని ఈశ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం ఈ విషయం తెలుసుకున్న చీఫ్ విప్ మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు జగదీష్ కుటుంబాన్ని పరామర్శించారు.
kvcs
చికిత్స పొందుతున్న జగదీష్ ఆరోగ్య పరిస్థితిని తల్లిదండ్రులు నర్సింలు, యశోధలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా యువకుడికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు. ఆయన వెంట వికారాబాద్ సీనీయర్ నాయకులు రత్నారెడ్డి, వెంకట్ రెడ్డి, పన్నాల సాయిరెడ్డి, అశోక్, శేఖర్, యువకుడి సోదరుడు ప్రశాంత్, కుటుంబ సభ్యులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

దర్నాపై కేసుల నమోదు దుర్మార్గం