సొంతింటి కల సారానికి తోడ్పాటు

తాండూరు రాజకీయం వికారాబాద్

సొంతింటి కల సారానికి తోడ్పాటు
– మాజీ కౌన్సిలర్ విజయాదేవి రంగారావు
– లబ్దిదారులకు ఇందిరమ్మ ఇంటి ప్రొసిడింగ్ అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు పథకంతో తోడ్పాటు అందిస్తోందని తాండూరు మున్సిపల్ 28వ వార్డు మాజీ కౌన్సిలర్ విజయాదేవి రంగారావు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకంలో భాగంగా 28వ వార్డు లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. సోమవారం మాజీ కౌన్సిలర్ విజయాదేవి తన వార్డులో లబ్దిదారులకు మంజూరైన ప్రొసిడింగ్ లను తన చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చేయూతను అందిస్తోందని అన్నారు. అర్హులైన లబ్దిదారులు ఇంటి నిర్మాణం చేపట్టి ఇందిరమ్మ చేయూతను సద్వనియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ బిచ్చప్ప, వార్డు ఇంచార్జ్ అగ్గనూర్ సరిత తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

హైవేపై తికమక.. ఉండదిక..!