ఎఎస్ జీఎఎంకే సేవలు గ్రేట్..!
– విద్యా, వైద్య రంగం సర్వీసులు అభినందనీయం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– ట్రస్ట్ చైర్మన్ ముజీబ్ ఖాన్ తోడ్పాటుకు మెచ్చకోలు
– ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజం పేదల అభ్యున్నతి కోసం ఎఎస్జీఎంకే ట్రస్టు అందిస్తున్న సేవలు అభినందనీయమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

సోమవారం ట్రస్ట్ చైర్మన్ ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో తాండూరు మున్సిపల్లో నూతనంగా ఎన్నికైన చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు అట్టహాసంగా సన్మాన కార్యక్రమం ఏర్పాట చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే సమక్షంలో ముజీబ్ ఖాన్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దల్ రజాక్‌లను సన్మానించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కూడా ముజీబ్ ఖాన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు సేవ చేయాలనే తపనతో ముజీబ్ ఖాన్ జీఎంకే ట్రస్ట్ ఏర్పాటు చేసి విద్యా, వైద్య రంగాలలో నిరుపేదకు కుల మతాలకతీతంగా సేవలు అందించడం అభినందనీయమన్నారు. ట్రస్ట్ ద్వారా ఇళ్ల స్థలాలు పంపిణి చేయడంతో పాటు, నిరుద్యోగ యువతీలకు కుట్టు మిషన్ శిక్షణ, విద్యారంగంలో వెనుకబడిన వారికి ఆర్థిక సహాయం చేయడం, వైద్యరంగంలో నిరుపేదలకు సేవ చేయడం వంటి సర్వీసులు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.

తన సంపాదలో 30% ట్రస్ట్‌కు కేటాయిస్తూ సేవలకు పునరంకితం కావడం చాలా గ్రేట్ అని కితాబిచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా పేదలకు అందిస్తున్న పథకాలలో జిఎంకే ట్రస్ట్ కు భాగస్వామ్యం చేస్తామని అన్నారు. మరోవైపు ట్రస్ట్ చైర్మన్ ముజీబ్ ఖాన్ మాట్లాడుతూ విద్యారంగంలో తాండూరు పట్టణంలో నిరుద్యోగ యువకుల కోసం త్వరలో బీఈడీ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. తమ ట్రస్టు ద్వారా పేదలకు అందిస్తున్న సేవలకు ప్రభుత్వం తరఫున చేయూతనివ్వాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, ట్రస్టు లీగల్ అడ్వైజర్ కరణం పురుషోత్తం రావు, అబ్దుల్ రావుఫ్, నయీమ్ అక్తర్, అబ్దుల్ ఆహాద్, కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నేతలు పాల్గొన్నారు.


