బీఆర్ఎస్‌ పార్టీకి గట్టి ఝలక్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్‌ పార్టీకి గట్టి ఝలక్..!
– సొంత గూటికి చేరుకున్న అఫ్పూ(నయూం)
– ఆహ్వానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చిందంటే..?
– కాంగ్రెస్‌లో చేరిన వెంటనే చేసిన పని ఇదే..
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఝలక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) పార్టీకి గుడ్‌ బై చెప్పి సొంతగూటికి చేరుకున్నారు.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి అఫ్పూ(నయూం)ను పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో అఫ్పూ(నయూం) పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి పట్టణ అధ్యక్షులుగా, పార్టీలో జిల్లా పదవులు నిర్వహించారు. 2019లో అప్పటి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

అప్పటి నుంచి అఫ్పూ(నయూం) బీఆర్‌ఎస్‌ పార్టీలో కొనసాగారు. సుమారు 4 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులుగా కొనసాగార. తాజాగా కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులుగా, పార్టీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్‌ రావు, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

రాజీనామా అనంతరం ఆయన తిరిగి సొంతగూడు పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనుచరులతో కలిసి కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను ఎమ్మెల్యేతో పాటు కలిశారు. కాంగ్రెస్ పార్టీలో అఫ్పూతో పాటు ఆయన బంధువు, మాజీ కౌన్సిలర్ ముక్తార్ నాజ్ కూడా ఉన్నారు.

ఇదికూడా చదవండి…

అట్టహాసంగా సదర్ ఉత్సవాలు..!