మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో అక్రమ నియామకాలు

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో అక్రమ నియామకాలు
– చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో అక్రమ నియామకాలు జరుగుతున్నాయని నిరుద్యోగులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ నారాయణరెడ్డికి ఈ ఫిర్యాదును అందజేశారు. జిల్లాలోని తాండూరు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను పత్రిక ప్రకటనతో పాటు త్రీమెన్ కమిటీ ద్వారా జిల్లా మైనార్టీ అధికారి, రీజిల్ కోఆర్డినేటర్ (ఆర్ఎల్సీ) అండ్ విజిలెన్స్ అధికారి ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. కాని నిబంధనలకు విరుద్ధంగా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో నియామకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నియామకాలపై విచారణ జరిపి.. మళ్లీ కొత్త నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నిరుద్యోగులు పి.జిలాని, షభానా, షఫీ, తస్లీమ్, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage