కేవీసీఎస్ విద్యార్థికి రాష్ట్ర స్థాయి అవార్డు
– భగవద్గీత శ్లోకాల పోటీలో ద్వీతీయ స్థానం
– అభినందించిన స్కూల్ యజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోటీ మహరాజ్ దేవాలయ ప్రాంగణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ హై స్కూల్(కేవీసీఎస్) విద్యార్థి రాష్ట్ర స్థాయి పోటీలో ప్రతిభ కనబరిచాడు.

ఆదివారం హైదరాబాద్ లోని కోఠిలో ఉన్న గుజరాతీ మహా విద్యాలయ విద్యాలయలో నిర్వహించిన భగద్గీత శ్లోకాల పోటీలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచాడు. పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న జి, కార్తీకేయ భగవద్గీత శ్లోకాల పోటీలో పాల్గొన్నాడు. శ్లోకాల పఠనం చేస్తూ ప్రతిభను కనబరిచాడు. శ్లోకాల పఠనం మనోరంజిప జేసింది. దీంతో రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీలో కార్తీకేయ రెండో స్థానంలో నిలిచాడు.

అతిథుల చేతుల మీదుగా కార్తీయ అవార్డుతో పాటు ప్రశంస పత్రం అందుకున్నాడు. కేవీసీఎస్ విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ప్రతిభను కనబరచడం పట్ల స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్, యజమాన్యం సంతోషం వ్యక్తం చేశారు. కార్తీకేయను అభినందించారు. తమ పాఠశాలలో విద్యతో పాటు సంస్కృతిక అంశాలలో విద్యార్థులను తీర్చిదిద్దడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఇదికూడా చదవండి…

