తొందరపాటెందుకు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తొందరపాటెందుకు..!
– కోర్టు ఆదేశాలపై తప్పుడు ప్రచారం
– మే 10వ తేది వరకు అధికారులకు గడువు
– ఆర్డీఓ దిగుజారుడు రాజకీయాలు మానుకోవాలి
-టీఆర్ఎస్ నేత తాటికొండ పరిమళ్ గుప్త
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు మున్సిపల్ వ్యవహారాలపై కోర్టులో వేసిన రిట్ పిటిషన్లపై తాండూరు ఆర్డీఓ తొందరపాటు పడుతున్నారని, కోర్టు ఆదేశాలపై ఏ తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్థానిక టీఆర్ఎస్ నేత, మున్సిపల్ చైర్ పర్సన్ భర్త తాటికొండ పరిమళ్ గుప్త అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ వ్యవహారాలపై కోర్టులో దాఖలు చేసిన ఫిటిషన్ల తీర్పు విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలతో తమ‌కు అనుకూలంగా తీర్పువచ్చిందంటూ ప్రచారం చేశారని అన్నారు. కోర్టు అపిలేట్ ఆథారిటీ ఇవ్వలేదని, కోర్టులో దాఖలైన అంశాలపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు మాత్ర‌మే ఇచ్చింద‌ని, అది తుది కాద‌ని స్ప‌ష్టం చేశారు. కేసులు ఇంకా కోర్టులో ప‌రిధిలోనే ఉన్నాయ‌న్నారు. పిటిష‌న్ల‌పై సెక్షన్ 65 కింద మే 10వ తేది వరకు గడువు ఇచ్చిందని తెలిపారు. ఈలోగా కోర్టులో దాఖలైన అంశాలపై చర్చించి మున్సిపల్ చట్టం ప్రకారం నిబంధనల ప్రకారం జరిగిందా లేదా అని తేల్బాలని చెప్పినట్లు స్పష్టం చేశారు. దీనిపై ఆర్డీఓ తొందరపాటుతో ఆర్డర్ కాపీ లేకుండా తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. అదేవిధంగా కార్మికుల 30శాతం పీఆర్సీ అమ‌లుపై కోర్టులో కేసు ఉన్నందుకు అమలు చేయలేమన్న ఆర్టీఓ వివరణపపై మ‌ళ్లీ కోర్టులో వేరే ఫిటీషన్ వేస్తే దానికి కోర్టులో ఉన్నందుకు అమలు చేయడంలేదని ఎక్కడా చెప్పలేదని కౌంటర్ దాఖ‌లు చేశార‌ని చెప్పుకొచ్చారు. ఇలా కార్మికుల ముందు ఒక మాట కోర్టులో మరో మాట చెప్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఇలాంటివి మానుకోవాలని అన్నారు. దమ్ముంటే కోర్టులో వేసిన ఆరోపణలను అమలు చేసి చూపించాలని సవాల్ చేశారు.