రామ మందిర దాతల ఉదారత..!
– దేవాలయ పునర్ నిర్మాణానికి చేయూత
– వస్తు, ధనరూపంలో సాయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరా నగర్‌లో పునర్ నిర్మిస్తున్న రామ మందిర దేవాలయం పునర్ నిర్మాణం కోసం దాతలు విరాళాలు అందిస్తూ ఉదారతను చాటుకుంటున్నారు.

పలువురు దాతలు దేవాలయ పునర్ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారు. వస్తు రూపంలో, ధనం రూపంలో సాయిం అందిస్తున్నారు. తాజాగా పట్టణానికి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి రామ మందిర పునర్ నిర్మాణం కోసం రూ. 15వేల 101లను విరాళంగా అందించారు.

అదేవిధంగా గుబ్బ వీరేశం దేవాలయం గర్భగుడి ద్వారంకు సాయం అందించగా దేవాలయ ద్వారంకు కె.రఘుచారి సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. వీరితో పాటు చల్లా ప్రభాకర్ అనే వ్యక్తి రూ. 11వేల విరాళం అందించారు. ఈ సందర్బంగా దేవాలయ కమిటి సభ్యులు మాట్లాడుతూ విరాళాలు అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయ పునర్ నిర్మాణంకు ఇంకా ఆర్థిక చేయూత అవసరం ఉందని తెలిపారు. దాతలు మందుకు వచ్చి దేవాలయ పునర్ నిర్మాణం పూర్తి చేసేందుకు సాయం అందించాలని కోరారు.

ఇదికూడా చదవండి…

