ఎమ్మెల్యే సహాకారంతో వార్డుల అభివృద్ధి

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్యే సహాకారంతో వార్డుల అభివృద్ధి
– 25వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
– వార్డు మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో పట్టణంలోని వార్డుల అభివృద్ధి జరుగుతోందని 25వ వార్డు మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు.

సోమవారం వార్డులో రూ. 3లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను ప్రభాకర్ గౌడ్ వార్డు ప్రజలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో వార్డులో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు.

తాగునీరు, విద్యుత్ సమస్యల పరిష్కారంతో పాటు మురుగు కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే సహాకారంతో కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు లేకుండా శ్రద్ధ వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పరమేష్, షఫీ, గులాం తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

వైకుంఠ దర్శనానికి వెళదాం.. రండి..!