భారత్ బంద్‌కు కదంతొక్కిన నేతలు
– తెల్లవారు జామునుంచే రోడ్లపైకి
– ఆర్టీసీ బస్సులను అడ్డుకున్న నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు పిలుపు చేపట్టిన భారత్ బంద్‌కు తాండూరు అఖిలపక్ష నేతలు కదం తొక్కారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, వామపక్ష పార్టీతో పాటు ఎస్ఎఫ్ఐ, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహారాజ్, పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, సీపీఐ రాష్ట్ర నాయకురాలు విజయలక్ష్మీ పండిత్, టీజేఎస్ ఇంచార్జ్ సోమశేఖర్, సీపీఎం నాయకులు శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, రాము తదితరులు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్‌లోకి వెళ్లి బస్సులను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు.అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజీల్ ధరలను, నితస్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని అన్నారు. ప్రభుత్వ ఆస్తుల ప్రవేటీకరణను మానుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు తాండూరు పట్టణంలో సోమవారం ఉదయం నుంచి బంద్ కొనసాగింది.
