కరోనా కట్టడి కోసమే ఫీవర్ సర్వే

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

కరోనా కట్టడి కోసమే ఫీవర్ సర్వే
– మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: క‌రోనా క‌ట్ట‌డి కోస‌మే ప్ర‌భుత్వం ఫీవ‌ర్ స‌ర్వే నిర్వ‌హిస్తుంద‌ని, ఇందుకు ప్ర‌జ‌లంద‌రు స‌హ‌క‌రించాల‌ని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. సోమవారం తన వార్డు 9లో నిర్వహించిన ఫీవర్ సర్వే, వ్యాక్సీనేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫీవర్ సర్వేలో లక్షణాలు ఉన్నవారికి హోం ఐసోలేషన్ కిట్లను అందజేయాలని సర్వే బృందాలను ఆదేశించారు. వార్డులో 15 ఏండ్ల నుంచి 18 ఏండ్ల వ‌య‌స్సు ఉన్న టీనేజ‌ర్ల‌కు వ్యాక్సీనేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగంగా పూర్తి చేయాల‌న్నారు. వ్యాక్సీనేషన్ వేసుకోని మిగ‌తా వారికి అవగాహన కల్పించి టీకా వేసుకునేలా చూడాలన్నారు. అదేవిధంగా కరోనా కట్టడి కోసమే ప్రభుత్వ సర్వే నిర్వహిస్తుందని అన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా టీనేజర్లతో పాటు అర్హులందరు వ్యాక్సినేషన్ తప్పక వేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సుధారాణి, ఆర్పీ సైరా భాను, అంగన్వాడి టీచర్ నవీనా, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.