అదరగొట్టిన అక్షర విద్యార్థిని..!
– జాతీయ ఖోఖో పోటీలకు ఎంపికై శ్రీలక్ష్మీ
– అభినందించిన ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయిలో ఖోఖో పోటీలలో ఆక్షర్ హైస్కూల్ విద్యార్థిని కె.శ్రీలక్ష్మీ అదరగొట్టింది.

పోటీలో ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైంది. ఈ విషయాన్ని శుక్రవారం స్కూల్ ప్రిన్సిపల్ మోహన్ కృష్ణ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. గత నెల డిసెంబర్ 30వ తేది నుంచి తాండూరు పట్టణంలోని సేయింట్ మార్క్స్ స్కూళ్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో అక్షర్ హై స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న కె.శ్రీలక్ష్మీ పాల్గొంది. అండర్ 14 విభాగంలో పాల్గొన్న కె.శ్రీలక్ష్మీ ప్రతిభను కనబరించింది. దీంతో విద్యార్థినిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మోహన్ కృష్ణ గౌడ్ స్కూల్ విద్యార్థిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి పోటీలలో కూడా రాణించి పాఠశాలకు, జిల్లాకు పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు. విద్యార్థిని తీర్చిదిద్దిన పీఈటీలు రవీందర్ రెడ్డి, గోపాల్ లను అభినందించారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థినితో పాటు పీఈటీలను అభినందించారు.

ఇదికూడా చదవండి…

