దేశానికి కరోనా థర్డ్ వేవ్ ముప్పు
– కేసులు తగ్గినా అప్రమత్తత వహించాలి
– ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ డోసులు తప్పనిసరి
– కరోనా కొత్త వేరియంట్‌పై మోడీ ఎమర్జెన్సి మీటీంగ్
దర్శిని బ్యూరో: కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలతో దేశ ప్రధాని నరేంద్రమోడి ఉన్నత స్థాయి అధికారులో ఎమర్జెన్సి సమావేశం నిర్వహించారు. సౌతాఫ్రికా వేరియంట్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికాలో ప్రకంపనలు సృష్టించడంతో అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రినింగ్, పరీక్షలను కఠినతరం చేయాలని భారత ఆరోగ్య మంత్రిత్వశాఖ రాష్ట్రాలను కోరింది. ఈ నేపథ్యంలో శనివారం ప్రధాని నిర్వహించిన అత్యవసర సమావేశంకు ప్రాధాన్యత నెలకొంది. ఈ సమావేశంలో క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడి కరోనా టీకా డ్రైవ్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేశంలో ప్రతి ఒక్కరు టీకా తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ పూర్తి చేసుకున్న వారు ఎంత మంది ఉన్నారో వివరాలు తెలుసుకున్నారు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. అప్రమత్తంగా ఉండేలా చూడాలన్నారు. దేశంలో కరోనా పరిస్థితులపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.
అయితే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ, కరోనా వ్యాప్తిపై మోడీ ఆరా తీశారు. కొత్త వేరియంట్లపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మోడీ అధికారులను ఆదేశించారు. అయితే కొత్త వేరియంట్ B.1.1.1.529 గురించి పరిశీలించాలని, దేశంలో కూడా వ్యాప్తి చెందే అవకాశాలుండటంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అయితే అంతర్జాతీయ పర్యాణికులందరి నమూనాలను సేకరించి పరీక్షలు జరుపుతున్నారు. ఈ కొత్త వేరియంట్‌పై ఆరోగ్య మంత్రిత్వశాఖ, బయోటెక్నాలజీ విభాగం ఇప్పటికే పరిస్థితిని సమీక్షిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణికులందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

